సావిత్రి గా కీర్తి సురేష్ ఫస్ట్ లుక్, ఆ మహానటిని దించేసింది …

Keerthi Suresh

ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ బాగా నడుస్తుంది . ఆ మధ్య బాలీవుడ్ కి  మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కి కూడా పాకిందనే చెప్పాలి . ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి బయోపిక్ ని అయితే ఏకంగ ఇద్దరు తీస్తున్న విషయం తెలిసిందే .  అలనాటి అందాల నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా  ‘మహానటి’ చిత్రం తెరకెక్కుతోంది. నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సావిత్రిగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు.కీర్తి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసారు.

Keerthi Suresh

ఫస్ట్‌లుక్‌లో ఆ కాలం  నాటి ఫొటోలో కీర్తి కళ్లు మాత్రమే చూపించారు.ఫొటో చూడగానే సావిత్రేనా అనిపించేంతగా కీర్తి ఆ పాత్రలో ఒదిగిపోయారు. కీర్తి కళ్లు అచ్చం సావిత్రిలాగే ఉన్నాయి. ఈ ఫొటోని చిత్రబృందం విడుదల చేస్తూ.. ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ అని ట్వీట్‌ చేశారు.

ఫొటోని చూసి అభిమానులు ‘సావిత్రా న లేక కీర్తినా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ చిత్రంలో సమంత కీలక పాత్రలో నటించనున్నారు . ఇందులో మమ్ముట్టి తనయుడు  దుల్కర్‌ సల్మాన్‌, అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్‌ దేవరకొండ, షాలిని పాండేలు కూడా నటిస్తున్నారు.

Leave a comment