మెగా హీరోస్ మధ్య గ్యాప్.. కారణం ఇదేనా ?

చిరంజీవి మొద‌లు సాయి ధ‌ర‌మ్ వ‌ర‌కూ అంతా బిజినే! ప‌వ‌న్ మొద‌లుకొని బ‌న్నీ వ‌ర‌కూ అంతా కొత్త సినిమాల‌పై దృష్టి సారిస్తున్న‌వారే! ఇక కొణెద‌ల‌వారింటి అమ్మాయి మ‌రో వెబ్ సిరీస్ నాన్న కూచితో నెటిజ‌నుల ముందుకు రానున్న సంగ‌తీ తెల్సిందే! ఇలా అంతా వ‌రుస ప్రాజెక్టుల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నారు. ముఖ్యంగా గత కొంత కాలంగా ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న ఈ సుప్రీమ్ హీరో జవాన్ గా రాబోతున్నాడు. అలాగే వివి.వినాయక్ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాడు. ఇక మరో అల్లుడు అల్లు అర్జున్ అదే ఫార్మాట్ లో నా పేరు సూర్యా అనే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా మరో సరికొత్త చిత్రంతో రాబోతున్నాడు.

 

ఎక్కడికి పోతావు చిన్నవాడా దర్శకుడు విఐ.ఆనంద్ తెరకెక్కించబోయే సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు.ఇక మెగా తనయుడు రామ్ చరణ్ అయితే తన సినీ కెరీర్ లో ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 అనే సినిమా చేస్తున్నాడు.ఇది పూర్తైన వెంట‌నే బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా చేయ‌నున్నాడు. నాగ‌బాబు త‌న‌యుడు వరుణ్ తేజ్ కూడా తన చిన్నాన్న తొలి ప్రేమ టైటిల్ తీసుకొని సినిమా సెట్స్ పై ఉండగానే అందరిని ఆకర్షిస్తుండ‌డం విశేషం.

Leave a comment