బిగ్‌బాస్ 3…ఆ వ్య‌క్తి ఎవ‌రో బిగ్ స‌స్పెన్స్‌

latest update on bigg boss 3

స్టార్ మా ఛానెల్ తొలి రెండు సీజ‌న్ల క‌న్నా బిగ్ బాస్ 3ను మ‌రింత ఆస‌క్తిగా మార్చేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. తొలి సీజ‌న్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేసి ఈ షో మీద తెలుగు ప్రేక్ష‌కుల్లో విపరీత‌మైన ఆసక్తి ఏర్ప‌రిచేలా క్రియేట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఇక రెండో సీజ‌న్ హోస్ట్‌గా నేచుర‌ల్ స్టార్ నాని హోస్టింగ్ కూడా ఆక‌ట్టుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 3 సీజ‌న్ కూడా అదే రేంజ్‌లో హిట్ చేయాల‌ని స్టార్ మా యాజ‌మాన్యం రెడీ అవుతోంది.

ఈ క్ర‌మంలోనే కొత్త ప్రోమో కూడా సిద్ధం చేసింది. ఈ ప్రోమో చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. ఓ స్వామిజీ తన భక్తులతో “ మనసు కోతిలాంటిది,మరి అలాంటి మనసున్న మనుషులు ఓ ఇంట్లోకి చేరితే, వెటకారంతో మమకారంతో వారిని ఒక తాటిపైకి తెచ్చేది ఎవరు? అధికారంతో నడిపేది ఎవరు? ఆ ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపే శక్తిగల వ్యక్తి ఎవరు ? ” అని వాయిస్ ఓవ‌ర్ వస్తుంది.

అప్పుడు ఓ ముసుగు ధరించిన వ్య‌క్తి ముందుకు న‌డుచుకుంటూ వెళుతుంటాడు. ఇంత‌కు బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్ల‌ను కంట్రోల్ చేసే ఆ హోస్ట్ ఎవ‌రు ? అన్న‌దే ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది. ప్రేక్ష‌కుల్లో కూడా సీజ‌న్ 3 హోస్ట్ ఎవ‌రు ? అన్న ఉత్కంఠ క‌లిగేలా ఈ ప్రోమో డిజైన్ చేశారు.

ఇక అన‌ఫీషియ‌ల్ ప్ర‌కారం ఈ సీజ‌న్‌కు టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఉంటున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. తాజా ప్రోమోలో కూడా స్టార్ మా హోస్ట్‌ గురించి కానీ, ప్రారంభ తేదీ గురించి కానీ ఎటువంటి ప్రకటన చేయకుండానే సస్పెన్సు మెయింటైన్ చేశారు.

Leave a comment