జూనియ‌ర్ అంటే ఇష్ట‌మంటోన్న బాల‌య్య మ‌ర‌ద‌లు

నిన్నటితరం హీరోయిన్ గా కుర్రకారు మనసులను దోచేసిన నిరోషా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో మ‌ర్చిపోలేని సినిమాలు చేసింది. బాల‌య్య‌తో నారీ నారీ న‌డుమ మురారి సినిమాలో మ‌రో హీరోయిన్ శోభ‌న‌తో క‌లిసి బాల‌య్య‌కు చిలిపి మ‌ర‌ద‌లి పిల్ల‌గా ఆమె చేసిన న‌ట‌న మ‌ర్చిపోలేనిది. రాజేంద్రప్ర‌సాద్‌తో కొబ్బ‌రిబొండా లాంటి సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్‌గా మెప్పించింది.

ఇక పెళ్లి తరువాత సినిమాలను దూరం పెట్టింది. కొంతకాలం క్రితమే రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే సినిమాల్లో చేస్తోంది. ఇప్పుడు స్పీడ్ పెంచాల‌ని… త‌ల్లి, అత్త పాత్ర‌ల‌తో రాణించాల‌ని కోరుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న తాజా ఇంట‌ర్వ్యూలో అనేక ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డించింది. త‌న త‌రం హీరోల్లో సీనియ‌ర్ హీరో నాగార్జున గారంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పింది.

ఇక ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ అంటే ఎక్కువ ఇష్టం అని… ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన పాత్ర‌లు… ఇప్పుడు చేస్తోన్న పాత్ర‌లు చూస్తుంటే ఆయనలో పరిపక్వత స్పష్టంగా కనిపిస్తుంది. నటన .. డాన్స్ .. ఫైట్స్ .. ఇలా అన్ని అంశాలకి సంబంధించి ఆయన అద్భుతంగా చేస్తున్నాడ‌ని అందుకే ఎన్టీఆర్ సినిమాలు అన్ని తాను మొద‌టి రోజు మొద‌టి ఆటే చూస్తాన‌ని ఈ సీనియ‌ర్ హీరో చెప్పింది.

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లో న‌టించే అవ‌కాశం కోసం వెయిట్ చేస్తున్నాన‌ని.. ఆ అదృష్టం త‌న‌ను ఎప్పుడు త‌లుపు తడుతుందో అని వెయిటింగ్‌లో ఉన్నాన‌ని చెప్పుకొచ్చింది. మ‌రి నిరోషా కోరిక‌ను ఎన్టీఆర్ ఎప్పుడు తీరుస్తాడో ? చూడాలి.

Leave a comment