ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణకు అస్వస్థత.. పరిస్థితి విషమం..!

58

టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. దర్శకుడిగా ఆయన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా ద్వారా పరిచయమై పలు కుటుంబ కథా చిత్రాలను రూపొందించారు. కొంతకాలం క్రితం పక్షవాతం బారిన పడ్డ ఆయన కొంతకాలానికి కోలుకొని ఇతరుల సహాయంతో నడవడం మొదలుపెట్టారు.

కానీ ఈసారి మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. కోడీ రామకృష్ణ అప్పట్లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ ని వాడి అమ్మారు, అంజి, దేవి, అరుంథతి సినిమాలు తెరకెక్కించారు. ఆయన రూపొందించిన ‘అమ్మోరు’,’అరుందతి’ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.

తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆయన కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగానే కాకుండా పలు సినిమాల్లో నటుడిగా కూడా నటించారు. ఈ వార్త తెలిసిన కొందరు సినీ ప్రముఖులు హాస్పిటల్ కి చేరుకొని ఆయనను పరామర్శిస్తున్నట్లు సమాచారం.

Leave a comment