కమెడియన్ తో కీర్తి సురేష్ ప్రేమాయణం..?

166

తెలుగు, తమిళ, మళియాళ చిత్రం పరిశ్రమలో అతి తక్కువ కాలంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఈమె తల్లి గతంలో చిరంజీవి నటించిన ‘పున్నామినాగు’సినిమాతో నటించిన మేనక. సినీ నేపథ్యం నుంచి వచ్చిన కీర్తి సురేష్ మొదట మాలీవుడ్ లో నటించింది. తెలుగు లో నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’సినిమాతో కీర్తి సురేష్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ఇక హై రేంజ్ హీరోయిన్ల పై ఇండస్ట్రీలో పుకార్లు పుట్టుకు రావడం కామన్.

తాజాగా కీర్తి సురేష్ ఓ టాప్ కమెడియన్ తో చట్టాపట్టాలేసుకొని తిరుగుతుందని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. మహానటి సినిమా హిట్ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకుంది కీర్తి సురేష్. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘దర్భార్’లో ఛాన్స్ కోట్టేసింది. ఇక కీర్తి వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ తమిళ కమెడియన్‌తో ఎఫైర్ సాగిస్తుందిని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు,అది పెద్ద టాక్ కూడా అయింది.

ఈ రూమర్లకు కారణం కీర్తి సురేష్ కెరీర్ బిగినింగ్ లో ఆ కమెడియన్ ఎంతో సహాయం అందించాడట..ఆ కృతజ్ఞతతోనే అతని స్నేహ సంబందాలు కొనసాగిస్తుందట కీర్తి సురేష్. వీరిమధ్య బంధం స్నేహంగా మారింది ఆ తరువాత అది ప్రేమగా మారిందని సమాచారం. కీర్తి సురేశ్ ఎక్కడ షూటింగ్ కు వెళ్ళిన అక్కడికి అతడు కూడా వస్తున్నాడట. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని గుసగుసలు కాస్తా ఎక్కువుగానే వినిపిస్తున్నాయి. కానీ ఇవేవీ ఈ అమ్మడు పట్టించుకోకుండా అతనితో స్నేహబంధాన్ని కొనసాగించడం పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారట.

Leave a comment