Gossipsకాలా రిలీజ్ రోజు ఎదురుదెబ్బ..!

కాలా రిలీజ్ రోజు ఎదురుదెబ్బ..!

సూపర్ స్టార్ రజినికాంత్, రంజిత్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కాలా. కబాలి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా ఈసారి గట్టి టార్గెట్ తో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా రెండు మూడు సార్లు వాయిదా పడగా ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగులో అయితే ఈ సినిమా కొనేవారే లేకుండా పోయారట. నిర్మాతలు భారీ రేంజ్ లో డిమాండ్ చేయగా తెలుగు బయ్యర్లు మాత్రం ఈసారి తెలివిగా వ్యవహరించారట. 30 కోట్లకు మాత్రమే తెలుగు రైట్స్ తీసుకున్నారు. అది కూడా అడ్వాన్స్ బేసిస్ లోనే అని తెలుస్తుంది.

కాలా రిలీజ్ నాడు కూడా ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుంది. రజిని సినిమాకు ఉండాల్సిన రెగ్యులర్ బజ్ ఏమాత్రం కనిపించని ఈ కాలా రజిని సిని, పొలిటికల్ కెరియర్ కు చాలా ప్రాముఖ్యత వహించనుంది. మరి ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితం సాధిస్తుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news