Gossipsకాలా హిట్ అయినా.. బయ్యర్లకు కష్టాలే ..!

కాలా హిట్ అయినా.. బయ్యర్లకు కష్టాలే ..!

రజిని సినిమా అంటే ఆ హంగామా వేరేలా ఉంటుంది. తమిళనాడులోనే కాదు తెలుగులో కూడా రజినికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులో వారం ముందే హడావిడి మొదలుపెట్టగా తెలుగులో మాత్రం కాలా రిలీజ్ కు ఏమాత్రం క్రేజ్ రాలేదు. దీనికి కారణం రజినికాంత్ కబాలి సినిమానే కారణం.

ఆ సినిమా మిగిల్చిన నష్టాల వల్ల డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డున పడ్డారు. ఆ ఎఫెక్ట్ కాలా మీద పడ్డది. పా. రంజిత్ డైరక్షన్ లో కబాలి రిలీజ్ ముందు భారీ హైప్ తీసుకురాగా రిలీజ్ తర్వాత తుస్సుమనిపించింది. ముఖ్యంగా తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కు ఈ సినిమా బాగా దెబ్బేసింది. అందుకే ఈసారి కాలాకి కేవలం తెలుగు రెండు రాష్ట్రాలకు కలిపి 30 కోట్లకు తీసుకున్నారు.

ఇక కబాలి ఎఫెక్ట్ తో సరైన థియేటర్స్ కూడా రాలేదని తెలుస్తుంది. ఎంత పెద్ద సూపర్ స్టారైనా సరే ఫ్లాప్ పడితే అంతే సంగతులు అన్నట్టుగా.. కాలా సినిమా తెలుగులో మాత్రం ఇంకా బయ్యర్లకు కష్టాలు కొనసాగించేలానే పరిస్థితులు కనబడుతున్నాయి. టాక్ బాగుందని వచ్చినా సరే వారు భయపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news