ఫెయిల్యూర్‌ బ్యాచ్‌కు ఇస్మార్ట్ టెస్ట్

Ismart Shankar Key For All Failures

టాలీవుడ్ ఒకప్పటి క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వరుస ఫెయిల్యూర్స్‌తో ఫేడవుట్ అవుతున్నాడు. అయితే మనోడు తాజాగా డైరెక్ట్ చేస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఒక్క పూరీ జగన్నాథ్‌కే కాకుండా ఈ సినిమాతో లింక్ ఉన్న చాలా మందికి చాలా కీలకంగా మారింది.

ఈ సినిమాపై హీరో రామ్ పోతినేని చాలా ఆశలు పెట్టుకున్నాడు. నేను శైలజ తరువాత వరుసబెట్టి సినిమాలు ఫ్లాప్‌ కావడంతో ఇస్మార్ట్ శంకర్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు ఈ హీరో. అటు హీరోయిన్లు నిధి అగర్వాల్‌, నభ నటేష్‌కు కూడా ఈ సినిమా అంతే ముఖ్యం. వారిద్దరు చేసిన సినిమాలు కూడా ఏవీ బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేశాయి. అటు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు కూడా ఈ సినిమా చాలా ముఖ్యంగా మారింది.

వీరందరితో పాటు ఛార్మీకి కూడా ఈ సినిమా చాలా కీలకంగా మారింది. పూరీ-ఛార్మీ కలిసి ప్రొడ్యూస్ చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేయడంతో ఈ సినిమా వారికి లాభాలను కురిపిస్తుందని వారు ఆశగా ఉన్నారు. మరి ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఇంతమంది ఫెయిల్యూర్‌లకు ఎంతమేర సహాయపడుతుందో చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Leave a comment