రాజుగారి గది 3 నుంచి తమన్నా ఔట్..!

బుల్లితెరపై ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి దర్శకుడిగా మారిన ఓంకార్ హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో తీసిన రాజుగారి గది సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా సీక్వెల్ గా కింగ్ నాగార్జున, అందాల భామ సమంత ముఖ్య పాత్రల్లో రాజుగారి గది 2 తీశారు. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేక పోయింది. రాజుగారి గది 2 సీక్వెల్ హర్రర్ జోనర్ లో రాజుగారి గది 3 మూవీ తీయబోతున్నట్లు ఆమద్య అనౌన్స్ మెంట్ చేశారు.

ఈ మూవీలో గత వారమే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తమన్నా ప్రధాన నటిస్తోందని ప్రకటించారు. ప్రారంభోత్సవానికి కూడా తమన్నా హాజరైంది. అంతలోనే చిత్రయూనిట్ కు భారీ షాక్. ఈ మూవీ నుంచి తమన్నా తప్పుకున్నట్లు ఫిలిమ్ వర్గాలు టాక్ .

ఇటీవల కాలంలో తమన్నా హర్రర్ నేపథ్యంలో ఉన్న సినిమాలో నటిస్తుంది. ఈ కారణంతోనే రాజుగారి గది 3 లో నటించడానికి ఉత్సాహం చూపించింది. ఓంకార్ 6 నెలల క్రితమే రాజుగారి గది 3 కథని తమన్నాకి వినిపించాడట. ఆ సమయంలో కథ, తన పాత్ర తమన్నాని బాగా ఆకట్టుకోవడంతో వెంటనే ఒప్పేసుకుంది.

తీరా ఈ మూవీ ప్రారంభోత్సవ సమయంలో ఫైనల్ నేరేషన్ తమన్నాకు చెప్పాడట ఓంకార్. ఈ కథలో చాలా మార్పులు చేర్పులు చేశారట ఓంకార్..దాంతో తమన్నాకు తన పాత్ర విషయంలో అసంతృప్తి కలిగిందట. దీనితో సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో త్వరలో తెలియాల్సి ఉంది.

Leave a comment