‘మా’ డబ్బు ఏమైంది.. 7 లక్షలు రాజశేఖర్ కూతురు ఖాతాలోకి..!

159

శివా రాజా వర్సెస్ నరేష్ పోటీలో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా నరేష్ విజయం సాధించాడు. నరేష్ ప్యానెల్ లో జీవిత రాజశేఖర్ కు స్థానం కల్పించారు. వారు కూడా విజయం సాధించడం జరిగింది. మొదటి నుండి వివాదాలు సృష్టిస్తున్నా ప్రస్తుత మా ప్యానెల్ సభ్యులు లేటెస్ట్ గా మరో వివాదంలో చిక్కుకున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎకౌంట్ నుండి 7 లక్షల రూపాయలు రాజశేఖర్ కూతురు ఖాతాలోకి జమ అయ్యాయి.

మా బిల్డింగ్ కు తెలంగాణా ప్రభుత్వం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. అయితే వారి ప్రచారానికి 7 లక్షలు ఖర్చు చేసినట్టు చెప్పారు జీవిత. నరేష్ ప్రస్తుతం షూటింగుల్లో బిజీగా ఉండటం వల్ల తమ డబ్బు అటు ఖర్చు పెట్టామని ఇప్పుడు అదే డబ్బు తమ ఖాతాలో వేసుకున్నామని వివరణ ఇచ్చారు. అయితే ఇదంతా ప్యానెల్ సభ్యుల ఆమోదంతోనే అన్ని నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని చెప్పారు జీవిత.

మొదటి నుండి నరేష్ ప్యానెల్ ఎక్కడ దొరుకుతుందా ఆడేసుకుందామని కొందరు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎమౌంట్ గురించి కూడా కావాలని నానా హంగామా చేస్తున్నారు. నరేష్ ప్రస్తుతం ఈస్ట్ గోదావరిలో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన వచ్చాక జెనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది.

Leave a comment