సౌండ్ లేని చిట్టిబాబుకి చుక్కలు చూపించనున్న గీతా గోవిందం!

8

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఇటీవల బుల్లితెర మీద కూడా అదరగొట్టింది. ఇటీవల ఈ సినిమాను దసరా కానుకగా వరల్డ్ టీవీ ప్రీమియర్ షోగా టెలికాస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ‘రంగస్థలం’ సౌండ్‌కు గీతా గోవిందం రీసౌండ్ వినిపించనుందట.

బోల్డ్ హీరో విజయ్ దేవరకొండ, అందాల భామ రష్మిక మందన నటించిన గీతా గోవిందం చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో విజయ్ ఫ్యామిలీ హీరోగా కూడా మంచి మార్కులు కొట్టేసాడు. యూత్ మోత్తాన్ని ఈ సినిమా ఒక మాయలోకి తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద బొంభాట్ కలెక్షన్లతో అదరగొట్టిన ఈ సినిమా రంగస్థలం రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యింది. దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగులో వరల్డ్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేయనున్నారు. రంగస్థలంకు 19.5 టీఆర్పీ రేటింగ్ రాగా, గీతా గోవిందం దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఎక్కువుందని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను బుల్లితెరపై ప్రేక్షకులు మిస్ కారని వారు అంటున్నారు. మరి చిట్టిబాబు సౌండ్‌కు గీతాగోవిందం రీసౌండ్ ఎలా తగులుతుందో తెలియాలంటే నవంబర్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

Leave a comment