Gossipsప్రియుడు బండారం బయటపెట్టిన దీపికా..!

ప్రియుడు బండారం బయటపెట్టిన దీపికా..!

దీపికా రణ్ వీర్ సింగ్ లు ఈమధ్యనే పెళ్లితో ఒకటైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రేమపక్షులుగా చాలాసార్లు వార్తల్లో నిలిచిన ఈ జంట ఫైనల్ గా వారి ప్రేమను గెలిపించుకున్నారు. రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్న ఈ పెళ్లి జంట చూడముచ్చటగా ఉంది. పెళ్లి తర్వాత తమ బంధం గురించి చెబుతున్నారు. సినిమాలకు చిన్నపాటి బ్రేక్ ఇచ్చిన రణ్ వీర్ పెళ్లి తర్వాత మళ్లీ వరుస సినిమాలు చేయనున్నాడు. ఇక దీపికా కూడా కెరియర్ కు కొద్దిపాటి బ్రేక్ ఇస్తుంది. ఇక పెళ్లి తర్వాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో రణ్ వీర్ గురించి కొత్త విషయాలు చెప్పింది.
2
రన్ వీర్ చాలా తెలివైన వ్యక్తి.. చాలా సెన్సిటివ్ కూడా.. కొన్నిసార్లు చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడని.. రన్ వీర్ కు చాలా ఎనర్జీ ఉంటుందని.. చాలా అల్లరి చేస్తాడని చెప్పుకొచ్చింది దీపికా పదుకునే. ఐక్యూ విషయంలో తనకన్న రన్ వీర్ కు ఎక్కువని అంటుంది. మనల్ని అర్ధం చేసుకునే మనిషితో జీవితాన్ని పంచుకోవడం చాలా బాగుంటుందని రన్ వీర్ మీద తన ప్రేమను చూపించింది దీపికా పదుకునే. పెళ్లి తర్వాత సాధారణంగా హీరోయిన్స్ సినిమాలను తగ్గిస్తారు కాని దీపికా అలా చేయనని చెబుతుంది.
1
ఇప్పటికే సంజయ్ లీలా భన్సాలి సినిమాకు ఓకే చెప్పగా.. మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీపికా, రన్ వీర్ ల జంట బాలీవుడ్ క్రేజీ జంటగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news