డిసెంబర్ రేస్ లో 20 సినిమాల క్యూ..బాక్సాఫీస్ షేక్..!

ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. డిసెంబర్ లో చాలా సినిమాలు రిలీజ్ రెడీ అయ్యాయి. సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తున్నాయి. అందుకే ఈలోగా తమ సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ డిసెంబర్ లో దాదాపు 10 సినిమాలకు పైగా రిలీజ్ అవుతుండటం విశేషం. డిసెంబర్ 1న ఆపరేషన్ 2019 వచ్చింది. ఎలక్షన్స్ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. ఇక డిసెంబర్ 7న దాదాపు ఐదారు సినిమాలు వస్తున్నాయి. 2.ఓ యావరేజ్ టాక్ తో నడుస్తుండటంతో డిసెంబర్ 7న భారీగా సినిమాలు వస్తున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ కవచం, వర్మ భైరవగీత, సుమంత్ సుబ్రహ్మణ్యపురం, సందీప్ కిషన్ నెక్స్ట్ ఏంటి.. సినిమాలు 7న రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కో జానర్ అవడం విశేషం. ఇక మరోపక్క డిసెంబర్ 21న కూడా భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. శర్వానంద్ పడి పడి లేచే మనసు, వరుణ్ తేజ్ అంతరిక్షం సినిమాలు వస్తున్నాయి. వీటితో పాటుగా కన్నడ స్టార్ యశ్ చేస్తున్న కె.జి.ఎఫ్ సినిమా కూడా ఆరోజునే రిలీజ్ అవుతుంది.

ఇక నిఖిల్ ముద్ర కూడా డిసెంబర్ 28న వస్తుంది. దీనితో పాటుగా శుభలేఖ+లు సినిమా కూడా ఈ మంత్ లోనే వస్తుంది. ఎలా లేదన్నా 10 నుండి 12 సినిమాల దాకా డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. కవచం, సుబ్రహ్మణ్య పురం తో పాటుగా పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాలు భరీ అంచనాలతో వస్తున్నాయి. కె.జి.ఎఫ్ డబ్బింగ్ సినిమా అయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. మరి డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాల లెక్క ఎలా తేలుతుందో చూడాలి.

Leave a comment