జై లవ కుశ ఫై సెలబ్రిటీ ల ట్విట్ ల వర్షం..!

jai lava kusa tweets

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కెరీర్‌లోనే తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు సూప‌ర్ హిట్ సినిమాల త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించిన లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం మూడు పాత్ర‌లు పోషించ‌డం, అన్న క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా, త‌న తాత ఎన్టీఆర్ పేరు మీదున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో న‌టించ‌డంతో జై ల‌వ‌కుశ‌పై రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కూడా సక్సెస్ అవ్వ‌డంతో ప్ర‌స్తుతం భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాకు రూ.112 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ప్ర‌పంచ వ్యాప్తంగా బాహుబ‌లి 2 త‌ర్వాత ఏ సినిమా రిలీజ్ కాన‌ట్టుగా ఏకంగా 2400 స్క్రీన్ల‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

 

jai lava kusa tweets
jai lava kusa tweets

మ‌రి లెక్క‌కు మిక్కిలిగా, స్కైను ట‌చ్ చేసే అంచ‌నాల‌తో వ‌చ్చిన జై లవ కుశ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది , కదా పరంగా రొటీన్ స్టోరీ ఐన , ఎన్టీఆర్ నటనతో , లుక్స్ తో సినిమా ని క్లౌడ్ 9 లో పెట్టాడని అభిమానులు , సినీప్రేక్షకులతోపాటు  సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు .  దర్శక ధీరుడు రాజమౌళి మొదలుకొని , కొరటాల శివ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ , మాటల రచయిత కోన వెంకట్ ,  రాజమౌళి కుమారుడు స్ కార్తికేయ వరకు ఎవరి తోచింది వారు ట్వీట్ చేస్తున్నారు . రాజమౌళి తనయుడు ఐతే తాను తారక్ అభిమానిగా వున్నాడు చాల గర్వపడుతున్నాను అని , తారక్ తన అభిమానులని క్లౌడ్ 9 లో పెట్టాడని చాల ఆనడం తో ట్వీట్ చేసాడు .

Leave a comment