టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతున్న ‘భీష్మ’..!

195

టాలీవుడ్ లోకి ‘జయం’సినిమాతో హీరోగా పరిచయం అయిన నితిన్ కొత్తలో మంచి హిట్ సినిమాల్లో నటించారు. దిల్ సినిమా నితిన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించకున్నా ఈ యంగ్ హీరో ఇప్పటి వరకు తన ఇమేజ్ నిలుపుకుంటూ వస్తున్నాడు.

ఆ మద్య ఇష్క్, గుండజారి గల్లంతయ్యిందే మంచి హిట్స్ అయ్యాయి..చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత నటించిన ‘అ..ఆ’ మంచి సక్సెస్ అయ్యింది. తర్వాత వచ్చిన సినిమాలు వరుస ఫ్లాపులు అయ్యాయి. గత ఏడాది `శ్రీనివాస క‌ల్యాణం` మంచి కుటుం కథా నేపథ్యంతో వచ్చినా..ఈ సినిమా కూడా అపజయం అయ్యింది.
194
దాంతో చాలా గ్యాప్ తీసుకున్న నితిన్ తాజాగా వెంకీ కుడుముల ద‌ర్శ‌కత్వంలో ‘భీష్మ’సినిమాలో నటిస్తున్నారు. `భీష్మ‌` సినిమా ఈ రోజు (బుధ‌వారం) లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. పూజా కార్యక్రమాలతో చిత్ర యూనిట్ సినిమా పనులను ప్రారంభించింది.

ఈ మూవీలో గీతాగోవిందం ఫేమ్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమాకు మ‌హ‌తీ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 20 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

Leave a comment