ప్రేమించా..బహుమతి ఇస్తా అన్నాడు..నమ్మి ఘోరంగా మోసపోయిన సినీనటి

ఈ మద్య చాలా మంది సోషల్ మీడియా వేదికగా చేసుకొని అంటే ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మాద్యమాల ద్వారా ఒకరి ముఖం ఒకరికి తెలియకుండా ప్రేమలో పడటం దారుణంగా మోసపోవడం జరుగుతుంది. ఇలాంటి వాటికి మోసపోవొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరిస్తున్నా మోసపోతూనే ఉన్నారు.

తాజాగా తెలుగు సినీ నటి ఓ అజ్ఙాత వ్యక్తి మాయమాటలు నమ్మి దారుణంగా మోసపోయింది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ యువ కథానాయిక సోనాక్షి వర్మ ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ నైజీరియన్ కొన్ని రోజులు చాటింగ్ చేసింది. తరుచూ మెర్రిన్ నుంచి పోస్టులు వస్తుండేవి.
2
ఇక సోనాక్షి తన వలలో పడిందని కన్ఫామ్ చేసుకున్న ఆ మాయగాడు మెర్రిన్ తన వ్యక్తిగత వివరాలను పోస్టు చేశాడు. తాను లండన్‌లో ఉంటున్నానని, తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని పేర్కొన్నాడు. నీకు ఇక్కడికి రావాలంటే నేను పూర్తిగా హెల్ప్ చేస్తానని అన్నాడు. మన స్నేహానికి గుర్తుగా ఊహించని గిఫ్ట్ పంపిస్తానని అన్నాడు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా అది ఇంటికే వస్తుందని చెప్పుకొచ్చాడు.
1
అనుకున్నట్టే గత నెల 27న ఢిల్లీ విమానాశ్రయ అధికారుల పేరుతో సోనాక్షికి ఓ ఫోన్ కాల్ వచ్చింది.దాంతో సోనాక్షికి తనకు మంచి గిఫ్ట్ వస్తుందని కన్ఫామ్ చేసుకుంది..అయితే ఈ గిఫ్ట్ బాక్స్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపేందుకు రూ.85 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. నిజమేనని నమ్మిన సోనాక్షి అతడు చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.85 వేలు జమచేసింది. కొన్ని రోజులైనా గిఫ్ల్ రాకపోవడంతో తాను ఘోరంగా మోసపోయానని తెలుసుకొని వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment