ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిసాస్టర్ సినిమా.. 60 కోట్లు ఖర్చు – 4 కోట్లు రాబడి

biggest disaster movie

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా డిజాస్టర్ అయితే, ఆ ప్రభావం ఎంత మంది మీద పడుతుందో అందరికి తెలుసు కానీ ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో వేసిన పన్నీరులా అయిపోతే ఇంకా ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పలేము. బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ముద్దుల కొడుకు హర్షవర్ధన్ హీరోగా పరిచయం చేస్తూ తీసిన మీర్జియా సినిమా బాలీవుడ్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా పేరు కొట్టేసింది.

అనిల్ కపూర్ కొడుకు కాబట్టి ఈ సినిమాకు ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేసారు. ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయి నప్పుడు అలానే అని పించినా ట్రైలర్ రిలీజ్ నుంచి మాత్రం ఈ సినిమా పై ఉన్న అంచనాలు తారుమారయ్యాయి. ఇంతకీ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మరెవరో కాదు రాఖేష్ ఓం ప్రకాష్ మెహ్రా ఆ డైరెక్టర్ చివరి సినిమా బయో పిక్ క్యాటగిరి లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా రికార్డు కొట్టేసింది. ఆ తరువాత అతను తీసిన ఈ సినిమా మాత్రం భారీ డిజాస్టర్ గా రికార్డు కొట్టేసింది.

ఈ సినిమా కోసం దాదాపు 60 కోట్ల బడ్జెట్ పెట్టారట. కానీ ఈ సినిమా మొదటి ఆటకే హిస్టారికల్ డిసాస్టర్ గా పేరు తెచ్చుకుని కేవలం తొమ్మిది కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక మొత్తంగా 4 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ సినిమా మార్కెటింగ్ అండ్ ప్రింట్ ఖర్చులు కూడా తీసుకురాలేక మొత్తంగా 70 కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చుకుంది. ఈ సినిమా దెబ్బకి అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కెరియర్ పై మాయని మచ్చ గా మారిపోయింది.57f2e568c8c4f.image_ mirzya-standee-10th-aug

Leave a comment