Gossipsబాహుబలి ఖాతాలో మరో రికార్డ్.. గూగుల్ లో మనదే హవా..!

బాహుబలి ఖాతాలో మరో రికార్డ్.. గూగుల్ లో మనదే హవా..!

రాజమౌళి సృష్టించిన బాహుబలి సినిమా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. 2000 కోట్ల కలక్షన్స్ తో తెలుగు సినిమా సత్తా ఏంటో చాటి చెప్పిన ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన రికార్డ్ సాధించింది. గూగుల్ ప్లే లో బాహుబలి ది గేం ఇంటర్నేషనల్ గేంస్ తో పోటీపడి మరి నెంబర్ 1 గా నిలిచింది.

ఇంటర్నేషనల్ గేం లుగా ప్రసిద్ధి చెందిన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్స్‌, సూపర్‌ మ్యారియో రన్, పోకెమాన్‌ డ్యుయల్‌ గేం లతో పోటీపడి మరి బాహుబలు నెంబర్ 1 గా నిలిచింది. అంతేకాదు బాహుబలిలో సాహోరే బాహుబలి సాంగ్ గూగుల్ ప్లేలో అత్యధికంగా వీక్షించిన పాటగా రికార్డ్ నెలకొలిపింది. మొత్తానికి బాహుబలి సినిమా రిలీజ్ అయిన ఇన్ని నెలలకు కూడా రికార్డులు సృష్టిస్తూనే ఉంది.

విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన బాహుబలి సినిమా ఆర్కా మీడియా నిర్మాణంలో వచ్చింది. ఈ సినిమా కోసం ఐదేళ్లు చిత్రయూనిట్ పనిచేశారని తెలిసిందే. ప్రభాస్, రానాలకు ఈ సినిమాతో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ పెరిగింది.

https://www.youtube.com/watch?v=4gKi5WtQ5D8

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news