నితిన్-పూజా హెగ్దె “కళ్యాణం”

ముకుందా, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన పూజా హెగ్దె అప్పుడు ప్రేక్షకుల దృష్టిలో పడలేదు కాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దువ్వడ జగన్నాధం సినిమాలో బికిని లుక్ తో కనిపించే సరికి అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. బన్నితో జోడి కట్టిన పూజా ఆ సినిమాతో పాపులారిటీ సంపాదించింది. ఇక ఆ తర్వాత అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

డిజె తర్వాత వెంటనే శ్రీనివాస్ బెల్లంకొండ సినిమాలో హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ పట్టేసిన అమ్మడు ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ కూడా సొంతం చేసుకుందట. దిల్ రాజు నిర్మాణంలో శతమానం భవతి సినిమా డైరక్టర్ చేస్తున్న శ్రీనివాస కళ్యాణం సినిమాలో పూజా హెగ్దె ని హీరోయిన్ గా ఫైనల్ చేశారని టాక్. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా అనుకున్నా ఎందుకో డిజె భామకే చిత్రయూనిట్ ఓటేశారు.

త్వరలో ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందట. సినిమాకు మిక్కి జె మేయర్ మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది. డిజె భామకు ఈ సినిమా నిజంగానే లక్కీ ఆఫర్ అని చెప్పొచ్చు.

Leave a comment