Gossipsమోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య ఫైర్..?

మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య ఫైర్..?

టాలీవుడ్ లో ఇప్పటి వరకు స్టార్ హీరోల వారసులు ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ హీరోలు అడపాదడపా సినిమాలు చేస్తూ తమ వారసుల కెరీర్ పై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా,అక్కినేని, నందమూరి, మంచు ఫ్యామిలీ ల నుంచి హీరోలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తర్వాత కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు.

కాకపోతే బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా గత నాలుగు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే కారణం ఏంటో కాని వరుసగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. మోక్షజ్ఞ ఇప్పుడు ఎలా ఉన్నాడు అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే మోక్షజ్ఞ ఇప్పటి వరకు మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అంటూ తాజాగా ఎన్టీఆర్‌ మహానాయకుడు మూవీ విడుదల సందర్బంగా బాలకృష్ణను మీడియా అడిగిన సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఖచ్చితంగా మోక్షజ్ఞ మూవీ ఉంటుందని చెప్పాడు. మోక్షజ్ఞ హీరోగా పరిచయం చేసే బాధ్యత మాస్ డైరెక్టర్ బోయపాటికి అప్పజెప్పినట్లు తెలుస్తుంది. అంతా కుదిరితే వచ్చే యేడాది వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సిని సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం అందుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news