Gossipsకోడి రామకృష్ణ తల బ్యాండ్ వెనుకాల ఉన్న సీక్రెట్ అదే..!

కోడి రామకృష్ణ తల బ్యాండ్ వెనుకాల ఉన్న సీక్రెట్ అదే..!

శతచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ శుక్రవారం అకాల మరణం సిని పరిశ్రమకు దిగ్బ్రాంతికి గురి చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ ఫ్యాంటసీ సినిమాలకు పెట్టింది పేరు. ట్రెండ్ ఎలా ఉన్నా అలాంటి సినిమాలు చేయాలంటే మాత్రం మొదట కోడి రామకృష్ణ పేరు వినిపిస్తుంది. అలాంటి దిగ్గజ దర్శకుడిని కోల్పోయినందుకు పరిశ్రమ అంతా షాక్ లో ఉంది.

దాసరి ప్రియ శిష్యుడైన కోడి రామకృష్ణ గురువుగారిలానే 100 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక కోడి రామకృష్ణ పేరు వినగానే తలకు ఉన్న బ్యాండ్ గుర్తుకొస్తుంది. అసలు ఆ బ్యాండ్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అంటే.. మా పల్లెలో గోపాలుడు సినిమా షూటింగ్ లో ఎండ బాగా ఉండటం వల్ల కోడి రామకృష్ణ నుదురు ఎక్కువగా ఉంటుందని కాస్టూం డిజైనర్ మోకా రామారావు ఆయన జేబు రుమాలు తీసి నుదుట కట్టారట. అయితే అది ఆయనకు బాగుందని అది పూర్వ జన్మలో కూడా ఇలానే ఉండుంటారు అంటూ చెప్పాడట.

ఆయన చెప్పిన మాటలు నచ్చి ఆ రుమాలును అలానే కొనసాగించారని చెప్పుకొచ్చారు కోడి రామకృష్ణ. అంతేకాదు ఇటీవల ఇంటర్వ్యూలో చాలా విషయాలను ఆయన ప్రస్థావించారు. కాని ఇంతలోగానే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్తారని ఎవరు ఊహించలేదు. తెలుగు, తమిళ, హింది, కన్నడ, మళయాళ అన్ని భాషల్లో ఆయన సినిమాలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణలతో ఎక్కువ సినిమాలు చేశారు కోడి రామకృష్ణ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news