బాల‌య్య సినిమాకి హీరోయిన్ ఫిక్స్

BalaKrishna

కెరియ‌ర్ పెద్దగా హిట్స్ లేవు. చెప్పుకునేంత కెరియ‌ర్ కూడా లేదు. అయినా ఈ సారి అదృష్టం వ‌రించిందామెకు. బాల‌య్య స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ కొట్టేసి ఇండ‌స్ట్రీలో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోయిన్లు న‌టిస్తున్న బాల‌య్య 102 వ సిన్మాలో మ‌రో నాయిక‌గా  హ‌రిప్రియ ఎంపికైంది.ఇప్పటికే నయనతార కన్ఫర్మ్ అవగా ఆ తర్వాత రెండో హీరోయిన్ స్థానంలో ఇటీవలే మల‌యాళం బ్యూటీ నతాషా వచ్చిచేరింది.

వీరి త‌రువాత హ‌రిప్రియను ఓకే చేసింది యూనిట్‌. మొత్తంగా పిల్ల జమిందార్ సినిమాలో క్లాస్ లేడీగా, అబ్బాయి క్లాస్ అమ్మాయిగా క‌నిపించిన హ‌రిప్రియ‌కి ఓ విధంగా ఇది భ‌లే ఛాన్స్‌. త‌మిళ్ డైరెక్ట‌ర్ కెఎస్ ర‌వికుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాకు కర్ణ, జయసింహ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

మ‌రోవైపు బాల‌య్య మ‌రో సినిమాకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. త‌న తండ్రి జీవిత క‌థ ఆధారంగా డైరెక్ట‌ర్ తేజ‌తో ఓ సినిమా  చేయ‌నున్నారు.పొలిటీషియ‌న్‌గా, బ‌స‌వతార‌కం హాస్పిట‌ల్ నిర్వాహ‌కుడిగా, హీరో బాల‌య్య య‌మా బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లోనే మోక్ష‌జ్ఞ  ఎంట్రీ కూడా ఖాయం కానుంది.

Leave a comment