శనివారం అర్థరాత్రి పార్టీలో ఏం జ‌రిగింది??

సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ బర్త్ డే వేడుకలను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలకు ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. శనివారం అర్థరాత్రి వరకూ జరిగిన ఈ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, దర్శక నిర్మాతలు హాజరై సంద‌డి చేశారు.వీరిలో హీరో రవితేజతో పాటు సాయి ధరమ్‌తో పనిచేసిన దిల్ రాజు, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్‌, రవిలతో పాటు ఇండస్ట్రీకి చెందిన సంతోష్ శ్రీనివాస్, కొరటాల శివ, వెన్నెల కిషోర్ ఉన్నారు. వేడుక‌కు టాప్ ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ కూడా హాజర‌య్యారు.

 

తాజాగా ఈ పబ్ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.కాగా ప్ర‌స్తుతం సాయి ధరమ్ తేజ్- మెహ్రీన్ జంటగా నటించిన ‘జవాన్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మ‌రో రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు.వాటిలో క‌రుణాక‌రన్‌, మ‌రొక‌టి గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేయ‌నున్నారు.బర్త్‌డే సందర్భంగా ‘జవాన్’ మూవీ టైటిల్ సాంగ్‌ను మెగా అల్లుడు త‌న ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసి అభిమానుల‌తో త‌న ఆనందం పంచుకున్నారు.

Leave a comment