Gossipsరాసిపెట్టుకోండి.. బాలకృష్ణ సిఎం అవడం ఖాయమట..!

రాసిపెట్టుకోండి.. బాలకృష్ణ సిఎం అవడం ఖాయమట..!

సినిమాల మధ్య పోటీనే కాదు.. రాజకీయ పార్టీల మధ్య పోరు ఓ రేంజ్ లో నడుస్తుంది. ముఖ్యంగా త్వరలో జరుగనున్న ఏపి ఎన్నికలలో అధికార పార్టీ పర్ఫెక్ట్ వ్యూహ రచన చేస్తుంటే.. అందుకు భిన్నంగా ప్రతిపక్షంలో ఉన్న వైసిపి వ్యూహ పన్నాగాలు చేస్తుంది. ఈ రెండిటి మధ్యలో జనసేన కూడా హడావిడి బాగానే చేస్తుంది. తెలంగాణా ఎన్నికలు వార్ వన్ సైడే అన్నట్టు తేలిపోగా ఏపి ఎన్నికలు మాత్రం దీనికి భిన్నంగా ఉంటాయని తెలిసిందే.

ఇక ఈ టైంలో నందమూరి బాలకృష్ణ సిఎం అవుతారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేంటి చంద్రబాబు అంత ఈజీగా సిఎం సీటు వదిలేస్తారా అంటే.. బాలకృష్ణ సిఎం అవడం ఖాయమట కాకపోతే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ సినిమాలో సిఎంగా కనిపిస్తాడని తెలుస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.

ఈ సినిమా కూడా ఎన్.బి.కే ప్రొడక్షన్స్ లో వస్తుందట. వివి ఆర్ తో బోయపాటి శ్రీను లెక్క తప్పింది. అందుకే రాబోతున్న బాలయ్య సినిమాతో ఎలాగైనా తన సత్తా చాటాలని చూస్తున్నాడు బోయపాటి శ్రీను. బాలకృష్ణతో ఇప్పటికే సిం హా, లెజెండ్ సినిమాలు చేసిన బోయపాటి శ్రీను హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news