Gossipsతప్పు చేసిన రాజమౌళి..!నిజాలు బయటపెట్టిన బాబు గోగినేని..!

తప్పు చేసిన రాజమౌళి..!నిజాలు బయటపెట్టిన బాబు గోగినేని..!

దర్శక బాహుబలిగా పోరు పొంది ప్రపంచ వ్యాప్తంగా క్రెయేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అయితే ఈ వివాదంలో ఆయన ప్రత్యక్షంగా పాలుపంచుకోనప్పటికీ… అనుకోకుండా ఇందులో చిక్కుకున్నారు. ప్రముఖ హేతువాది.. ఇండియన్ హ్యూమనిస్ట్- రేషనలిస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ బాబు గోగినేని రాజమౌళి తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాను నాస్తికుడినంటూ రాజమౌళి గతంలో ఒకట్రెండు ఇంటర్వ్యూల్లో చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఐతే పైకి నాస్తికుడినని చెప్పుకుంటూ దానికి విరుద్ధంగా రాజమౌళి ప్రవర్తిస్తున్నాడని బాబు గోగినేని విమర్శిస్తున్నారు.

ఓ ఇంటర్వ్యూలో తాను నాస్తికుడిని అని చెప్పుకున్న రాజమౌళి.. ఆ తర్వాత రెండ్రోజులకే చొక్కా విప్పేసి కండువా వేసుకుని ఒక బ్రాహ్మణుడితో కలిసి లాంఛనంగా గుడికి వెళ్లారని బాబు అన్నారు. రాజమౌళి గుడికి వెళ్లడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే అలాంటివి చేస్తూ తాను నాస్తికుడిని అని చెప్పుకోవడమే సరికాదని ఓ టీవీ ఛానెల్ చర్చలో భాగంగా బాబు ఈ విషయాలన్నింటిని చెప్పుకొచ్చాడు. నాస్తికుడంటే దేవుడు లేడు అని నమ్మేవాడని.. తనలా దేవుడు లేడని నమ్ముతూ బతికే వాళ్లు చాలామంది ఉన్నారని.. ఈ ప్రపంచంలో వంద కోట్ల మందికి పైగా మతం లేకుండా.. దేవుడిని నమ్మకుండా ఉంటున్నారని.. కానీ రాజమౌళి నాస్తికుడినని చెబుతూ గుడికి వెళ్లడం ఏమిటని బాబు ప్రశ్నించారు.

ఇలాంటి వాళ్ల వల్ల తమ లాంటి వాళ్ళ వల్ల తాము తలదించుకోవాల్సి వస్తుందన్నారు. గతంలో సీపీఐ నారాయణ కూడా ఇలాగే ప్రవర్తించారని.. రాజమౌళికి ఈ విషయంలో తాను సంధించిన ప్రశ్నలకు జవాబు రాలేదని.. ఆయన తప్పు చేశారు కాబట్టి సమాధానం ఇవ్వలేరని భావిస్తున్నట్లు బాబు ఆ ఇంటర్వ్యూలో నిప్పులు చెరిగాడు. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news