ఎన్టీఆర్ దర్శకుడికి ‘చిరు’ షాక్..!

chiru

బాబీ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం జై లవకుశ హిట్ పై స్పందిస్తూ.. కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నాడు బాబీ. దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గురించిన ఓ విషయం వెల్లడించారు. అది ఎన్టీఆర్ అభిమానులను సైతం షాక్ కు గురిచేసింది.

‘జై లవకుశ’ పాత్రల్లో ఎన్టీఆర్‌ని తప్ప మరెవ్వరినీ వూహించలేను. మరీ ముఖ్యంగా ‘జై’గా చెలరేగిపోయారు. ‘ ఎన్టీఆర్‌ని చాలా కొత్తగా చూపించారు’ అని ఆయన అభిమానులంతా అంటుంటే నా ఆనందానికి అవధుల్లేవు”. ఇక ‘జై లవ కుశ’ విడుదల రోజు చిరంజీవి మా ఇంటికొచ్చారు అని చెబుతూ ఆ విషయాలు ఇలా పంచుకున్నారు.

నేను మెగాస్టార్ ఫ్యాన్‌ ని. మా నాన్న నాకంటే ఇంకా పెద్ద అభిమాని. చిరంజీవి సినిమా విడుదలైతే అందరికంటే ముందు నాన్న ధియేటర్ దగ్గర ఉండేవారు. ఆమధ్య నాన్నగారి ఆరోగ్యం పాడైంది. ‘ఏరా.. చిన్నప్పుడు నీకు అన్ని చిరంజీవి సినిమాలు చూపించా. నాకు ఆయన్ని చూపించవా’ అని అడిగారు. అలా అనేసరికి నాకు చాలా బాధేసింది.

ఏంచేయాలో అర్థంకాక పాజిబిలిటీ ఏమైనా వుందేమోనని… వినాయక్‌ గారికి విషయం చెప్పా. సరిగ్గా అరగంటలో ఆయన్నుంచి ఫోన్.. ‘చిరంజీవి గారే మీ ఇంటికి వస్తున్నారు’ అని. ‘వద్దుసార్‌.. మేమే వస్తాం’ అని వినయ్‌ గారికి చెప్పా. కానీ ఆయన వినలేదు. ‘జై లవ కుశ’ విడుదల రోజున చిరంజీవిగారు మా ఇంటికి వచ్చి మాతో రెండుగంటల పాటు గడిపారు. దీంతో బాబీ ఆనందదానికి అవాదులే లేవు.

Leave a comment