అర్జున్ రెడ్డి డైరక్టర్ అదిరిపోయే ఛాన్స్..!

sandeep reddy vanga

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ప్రకంపణలు సృష్టించిన డైరక్టర్ సందీప్ రెడ్డి వంగ తన తర్వాత సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమా తీసిన సందీప్ అసలైతే ఆ సినిమాను శర్వానంద్ తో తీద్దామనుకున్నాడు. ఇక తన సినిమాను తానే నిర్మించి సత్తా చాటుకున్న సందీప్ కు బడా నిర్మాణ సంస్థ నుండి లక్కీ ఛాన్స్ వచ్చిందట.

మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు సినిమా తీసిన మైత్రి మూవీస్ నుండి సినిమా అవకాశాన్ని అందుకున్నాడట సందీప్ వంగ. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తాడని తెలుస్తుంది. అర్జున్ రెడ్డి బోల్డ్ అటెంప్ట్ అనిపించినా యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది ఈ సినిమా. అందుకే ఆ దర్శకుడి సెకండ్ మూవీ పైనా ప్రేక్షకులు దృష్టి పెట్టారు.

 

Leave a comment