అరవింద సమేత ట్రైలర్ హంగామా షురూ..! ట్రైలర్ లో అరుపులు..!

63

త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న అరవింద సమేత సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్ ఫ్యాన్స్ ను అలరిస్తుండగా సినిమా ట్రైలర్ మరో రెండు మూడు రోజుల్లో రిలీజ్ కానుందని తెలుస్తుంది.
3
అక్టోబర్ 2న అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక మొదలవుతుంది. ఇక ఈ ఈవెంట్ లోనే అరవింద సమేత ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారట. సినిమా ట్రైలర్ అద్భుతంగా వచ్చిందని.. తమన్ మ్యూజిక్ అదిరిపోతుందని అంటున్నారు.
1
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేయగా అరవింద సమేత సినిమా దసరా బరిలో వచ్చి ఎన్.టి.అర్ సక్సెస్ మేనియా కొనసాగిస్తుందని ఆశిస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

Leave a comment