వీర రాఘవ టీజర్ టైం వచ్చింది.. ఫ్యాన్స్ కు ఇక పండుగే..!

46

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరి మొదటి కలయికలో వస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా ఫస్ట్ లుక్కే బీభత్సమైన అంచనాలను ఏర్పరచగా మళ్లీ ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ సినిమా రేంజ్ పెంచింది. అదేంటి అంటే టీజర్ టైం ను తెలియచేసే పోస్టర్.

ఆ నటరాజుని ఎలా చూపిస్తే అభిమానులు ఖుషి అవుతారో బాగా తెలిసినట్టుంది అందుకే కటౌట్ కు తగ్గ కంటెంట్ తో ఎన్.టి.ఆర్ అరవింద సమేత వస్తుంది. ఆగష్టు 15న ఈ సినిమా టీజర్ వస్తుంది. ఉదయం 9 గంటలకు ఈ టీజర్ వస్తుంది. దానికి సంబందించిన పోస్టర్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సినిమాలో ప్రతి అంశం చాలా గొప్పగా ఉండేలా చూస్తున్న చిత్రయూనిట్ సినిమా సంచలనంగా మారేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న అరవింద సమేతలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Leave a comment