డిజాస్టర్స్ కే విశ్వరూపం చూపించిన కమల్..!

నటనకి కేరాఫ్ అడ్రెస్ అంటే టక్కున గుర్తొచ్చే నవరస కళాపోషకుడు కమల్ హాసన్. తనలాంటి పాత్రలు చేసేందుకు ఎవరు సాహించడం కాదు కదా ఆలోచించడానికి కూడా కష్టమే అనేంతలా తన పాత్రలు ఉంటాయి. ఇక సినిమా సినిమాకు ఆయన ప్రయోగాలు ఆడియెన్స్ ను సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. సౌత్ లోనే కాదు ఇండియన్ సినిమాలో ఫైన్ యాక్టర్స్ లో కమల్ హాసన్ ఒకరు.

పాత్ర ప్రాధాన్యతను బట్టి ఎలాంటి ప్రయోగానికైనా సరే తాను సిద్ధం అనేలా ఆయన కమిట్మెంట్ ఉంటుంది. వందల కొద్ది సినిమాలు.. కోట్ల కొద్ది అభిమానులు ఇవి చాలదా అని ఎప్పుడు అనుకోని నటుడు కమల్. అయితే ఆయన కెరియర్ ఈమధ్య కాస్త ట్రాక్ తప్పింది. ప్రతి ఒక్కరు ఆయన చూపిన ప్రయోగాల బాటే పట్టడంతో ఆయనని పట్టించుకోవడం మానేశారు.

పక్కాగా చెప్పాలంటే కమల్ సినిమా అంటే కనీసం సినిమాకు కావాల్సిన బజ్ కూడా ఏర్పడలేదు. దానికి ఉదాహరణ రీసెంట్ గా వచ్చిన విశ్వరూపం-2 అని చెప్పొచ్చు. 2013లో వచ్చిన విశ్వరూపం సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఈ పార్ట్ 2 ఏమాత్రం అంచనాలను అందుకోలేదు. ఈ సినిమాకు దర్శక నిర్మాతగా కమల్ పూర్తిగా నిరాశ పరచాడు.

కమల్ సినిమా అంటే సర్ ప్రైజ్ థింగ్స్ ఉంటాయని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. విశ్వరూపం 1 టెక్నికల్ గా కూడా శభాష్ అనిపించేలా చేశారు. ఎన్నో అద్భుతమైన సీన్స్ ఉన్నాయి పార్ట్ 1లో.. కాని పార్ట్ 2 దానికి పూర్తిగా విరుద్ధం.. ఏమాత్రం ఆకట్టుకోలేని కథనంతో విశ్వరూపం-2 వచ్చింది. ఇక ఈ సినిమా ఫలితం చూశాక కమల్ ఇక సినిమాలు ఆపేస్తేనే బెటర్ అన్న టాక్ వచ్చింది. ఆయనలో కూడా ఇదవరకు ఉన్నంత కసి కనబడటం లేదు.

విశ్వరూపం 2 కోసం భారీగా ప్రమోట్ చేసినా లాభం లేకుండా పోయింది. ఓ పక్క వర్షాల కారణంగా జనావాసం అతలాకుతలం అవుతుంటే ఈ టైంలో వచ్చిన కమల్ విశ్వరూపం 2 నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఫైనల్ గా ఈ సినిమా కమల్ కు భారీ నష్టాన్ని మిగిల్చే పరిస్థితి కబడుతుంది. ఎలాగు పొలిటికల్ పార్టీ పెట్టాడు కాబట్టి కమల్ ఇక రాజకీయాల్లోనే కొనసాగితే బెటర్.

Leave a comment