Gossipsఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్.. అరవింద సమేత రిలీజ్ డేట్ ఫిక్స్

ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్.. అరవింద సమేత రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అరవింద సమేత. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ ఫిక్స్ చేశారట. ఎన్.టి.ఆర్ మొదటిసారి రాయలసీమ యాసలో మాట్లాడబోతున్న ఈ సినిమా త్రివిక్రం మార్క్ కామిక్ టచ్ కూడా ఉంటుందట.

సరదా సంభాషణలు రాయడంలో త్రివిక్రం కు తిరుగులేదు. ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ అరవింద సమేతలో సరదా సరదాగా సాగుతుందట. ఫస్ట్ లుక్ తోనే సిక్స్ ప్యాక్ లో కనిపించి అలరించిన తారక్ సినిమాలో స్పెషల్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్ హిట్ మేనియాను కంటిన్యూ చేస్తుందని అంటున్నారు.

కొన్నాళ్లుగా ఫ్యాక్షన్ కథలకు దూరంగా ఉన్న తారక్ చాలా రోజుల తర్వాత కత్తి పట్టాడు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. క్రేజీ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ దసరా బరిలో నిలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news