Moviesఆఫీసర్ ఫెయిల్యూర్ పై... నాగార్జున సంచలన కామెంట్స్..!

ఆఫీసర్ ఫెయిల్యూర్ పై… నాగార్జున సంచలన కామెంట్స్..!

కింగ్ నాగార్జున రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఆఫీసర్. శివ లాంటి సూపర్ హిట్ అందించిన కాంబోలో పాతికేళ్ల తర్వాత వచ్చిన సినిమాగా ఆఫీసర్ భారీ అంచనాలతో వచ్చింది. కాని ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేదు సరికదా నాగార్జున కెరియర్ లో డిజాస్టర్ కా బాప్ అన్నట్టుగా కలక్షన్స్ ఉన్నాయి.

సీనియర్ స్టార్ హీరోస్ లో నవ మన్మధుడిగా స్ట్రాంగ్ కెరియర్ కొనసాగిస్తున్న నాగార్జున ఆఫీసర్ మొదటి రోజు వసూళ్లు ఇండస్ట్రీకే షాక్ ఇచ్చాయి. ఇక ఈ సినిమా ఫలితం తర్వాత నాగార్జున నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సినిమా గురించి ఎలా స్పందిస్తాడో అన్న నాగార్జున ఫైనల్ గా విన్ స్టన్ చర్చిల్ మెసేజ్ గుర్తుచేస్తూ ట్వీట్ చేశాడు.

సక్సెస్ ఎప్పుడూ ఫైనల్ కాదు.. ఫెయిల్యూర్ ఎప్పుడు హాని చేయదు. ధైర్యాన్ని పెంచేందుకు ఇవి ఉపయోగపడతాయి. వాటిని చూసి నవ్వుతూ ముందుకు సాగాలి అన్నట్టుగా నాగ్ ట్వీట్ చేశాడు. సక్సెస్, ఫెయిల్యూర్ ఎప్పుడు కామన్ అన్నట్టుగా నాగ్ తన ఆఫీసర్ ఫెయిల్యూర్ గురించి చెప్పకనే చెప్పాడని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news