‘ జై లవకుశ ‘ ఏపీ + తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్

jai lava kusa

ఎన్టీఆర్ న‌టించిన లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం మూడు పాత్ర‌లు పోషించ‌డం, అన్న క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా, త‌న తాత ఎన్టీఆర్ పేరు మీదున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో న‌టించ‌డంతో జై ల‌వ‌కుశ‌పై రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కూడా సక్సెస్ అవ్వ‌డంతో ప్ర‌స్తుతం భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాకు రూ.112 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ప్ర‌పంచ వ్యాప్తంగా బాహుబ‌లి 2 త‌ర్వాత ఏ సినిమా రిలీజ్ కాన‌ట్టుగా ఏకంగా 2400 స్క్రీన్ల‌లో ఈ సినిమా నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది . మ‌రి లెక్క‌కు మిక్కిలిగా, స్కైను ట‌చ్ చేసే అంచ‌నాల‌తో వ‌చ్చిన జై ల‌వ‌కుశ ఫస్ట్ డే బాక్స్ ఊఫ్స్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిందనే చెప్పాలి.

ఓవర్సీస్‌లో కేవలం ప్రీమియర్లతోనే 0 .6 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసేసిన జై లవకుశ రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపించింది . కొన్ని ఏరియాల్లో ఎన్టీఆర్‌ గత సినిమాల ఫస్ట్ డే వసూళ్ల రికార్డుల్ని ఈ చిత్రం అధిగమించేసింది. ఇక టాలీవుడ్‌లో కలెక్షన్లకు కీలకమైన నైజాం ఏరియాలో ఈ సినిమా 5.05 కోట్ల షేర్ రాబట్టింది.

ఇక నందమూరి హీరోల సినిమాలకు కంచుకోట అయిన సీడెడ్‌లో 3.77 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మొదటిరోజు షేర్ రూ.20 కోట్ల పైనే ఉంటుందని ప్రాథమిక అంచనా. ఇక కోస్తాలోని గుంటూరు, కృష్ణా, వెస్ట్‌, ఈస్ట్‌లలో సైతం ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. ఏరియా వైజ్‌గా వసూళ్ల పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

అయితే లాంగ్ రన్ లో ఈ సినిమా 120 కోట్ల వరకు వసూల్ చేస్తుందని ట్రేడ్ వర్గాల ప్రాథమిక అంచనా .

Leave a comment