ఎన్టీఆర్ బయోపిక్ కి డైరెక్టర్ దొరికేసాడు…

వంద సినిమాలు పూర్తయ్యాక నందమూరి బాలయ్య సినిమాలు తీసే స్పీడ్ మరింత  పెరిగింది. 101వ చిత్రం ‘పైసా వసూల్‌’ ఈమధ్యే విడుదలైంది.అనుకున్న విధంగా సినిమా సక్సెస్ కాకున్నా , బాలకృష్ణ క్యారెక్టర్ పరంగా వినూతనంగా అనిపించింది ప్రేక్షకులకి . ఈ సినిమా చూసిన  ఆడియన్స్ అందరు  బాలయ్య ఎలాంటి క్యారెక్టర్ ఐన అవలీలగా  ప్లే చెయ్యగలడు అనిపించేంత బాగా చేసారు బాలయ్య ఈ సినిమాలో .

అయితే ఈ మధ్యే మొదలైన  కె.ఎస్‌.రవికుమార్‌దర్శకత్వంలో 102వ చిత్రానికి సంబంధించిన షూటింగ్  స్పీడ్ గ  జరుగుతోంది. బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ ఓ సినిమా  చేయనున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ జీవిత కథకు సంబంధించిన స్క్రిప్టు పనులూ జరుగు తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడెవరనే విషయంలో జోరుగా చర్చ సాగుతున్నాయి . ‘త్వరలో దర్శకుడు ని అనౌన్స్ చేస్తానని బాలయ్య ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు .

ఇప్పుడు ఆ అన్వేషణకు ఫుల్‌స్టాప్‌ పడినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ చేతిలో పెట్టాలని బాలకృష్ణ నిర్ణయం తీసుకొన్నారని వినికిడి . ఇటీవల బాలకృష్ణ ,  తేజల మధ్య ఈ చిత్రానికి సంబంధించిన డిస్కషన్స్  జరిగాయి. ‘నేనే రాజు – నేనే మంత్రి’తో సక్సెస్  సాధించారు దర్శకుడు  తేజ.  తరవాత ఎవరితో సినిమా చేయాలన్న విషయంలో ఇంకా ఎలాంటి నిణయం తీసుకోలేదు. మరి ఎన్టీఆర్‌ జీవిత కథని తెరకెక్కించడానికి ఆయన ముందుకొస్తారా? లేదా? అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.

Leave a comment