అఖిల్ 3వ సినిమా డైరెక్టర్ ఫిక్స్..!

akhil
అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా చేస్తున్న సెకండ్ మూవీ హలో రిలీజ్ కు సిద్ధమైందని తెలిసిందే. విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తున్నారు. డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా తన తర్వాత సినిమా చేయాలని చూస్తున్నాడు అఖిల్.
ఇప్పటికే కథలను వినేస్తున్న అఖిల్ ఫైనల్ గా సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న కొరటాల శివతో సినిమా అంటే ఇక హిట్ అన్నట్టు లెక్కే. ప్రస్తుతం మహేష్ తో భరత్ అను నేను సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ తర్వాత అఖిల్ తో సినిమా చేయబోతున్నాడట.
క్రేజీ కాంబోగా రాబోతున్న ఈ సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. చరణ్, ఎన్.టి.ఆర్ సినిమాలు చేయాల్సి ఉన్నా వారు వేరే ప్రాజెక్టులతో బిజీ అవడం వల్ల కొరటాల శివ అఖిల్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఇక కొరటాల శివ లిస్ట్ లో బన్ని కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

Leave a comment