బాలయ్య ఇచ్చిన సర్ ప్రైజ్ కు షాక్ అయ్యారు..!

నందమూరి బాలకృష్ణ ఇచ్చిన సర్ ప్రైజ్ కు షాక్ అయ్యారు మంచు ఫ్యామిలీ. మంచు ఫ్యామిలీ కలిసి చేస్తున్న గాయత్రి సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. మోహన్ బాబు లీడ్ రోల్ లో చేస్తున్న ఈ సినిమాలో శ్రీయా హీరోయిన్ గా నటిస్తుంది. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ నిర్మాణంలో పెళ్లైన కొత్తలో మదన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఆరెఫ్సిలో జరుగుతుండగా అక్కడే బాలయ్య బాబు జై సింహా కూడా షూటింగ్ జరుపుకుంటుంది. షాట్ గ్యాప్ లో బాలయ్య పక్కనే జరుగుతున్న గాయత్రి సెట్స్ కు వెళ్లాడట. బాలయ్య సర్ ప్రైజ్ ఎంట్రీతో గాయత్రి యూనిట్ అంతా షాక్ అయ్యారని తెలుస్తుంది. మోహన్ బాబు, బాలయ్య కలిసి కొద్దిపాటి పిచ్చాపాటిగా మాట్లాడి షూటింగ్ విశేషాలను తెలుసుకున్నారట.
ఇదే విషయాన్ని తెలుపుతూ మంచు విష్ణు ట్విట్టర్ లో మెసేజ్ పోస్ట్ చేశాడు. మంచు ఫ్యామిలీతో బాలయ్యకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మోహన్ బాబు కొద్దిపాటి గ్యాప్ తో లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆకాంక్షించారు బాలకృష్ణ.

Leave a comment