ఆ.. ఏముంది ఒక్క నిముష‌మే క‌దా? పవన్ ప్లాప్ అందుకేనా..?

agnathavasi flop details

ఆ.. ఏముంది ఒక్క నిముష‌మే క‌దా? అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కొక్క సారి ఆ ఒక‌టి రెండు నిమిషాలు మ‌నం చూపించే అశ్ర‌ద్ధ‌, నిర్ల‌క్ష్యం అమూల్య‌మైన అవ‌కాశాలను మ‌న‌నుండి దూరం చేస్తాయి. అనేక వ్యాపారాలు కూడా దెబ్బ‌తింటాయి. ఇప్పుడు ఈ ఒక్క నిముష‌మే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొంప ముంచింద‌ని టాలీవుడ్ విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి! అదేంటి ఒక్క నిముషం.. ఏంటి? అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌ద్దాం! ఇటీవ‌ల ప‌వ‌న్ మూవీ అజ్ఞాత వాసి విడులైన విష‌యం తెలిసిందే. వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి, ప‌వ‌న్ ఎంతో రిస్క్ చేసి తీసిన మూవీ ఇది. అయితే, విడుద‌ల కాక‌ముందు దీనిపై ఉన్న హైప్ విడుద‌ల త‌ర్వాత ఒక్క‌సారిగా నీరుగారి పోయింది.

దీనికి కార‌ణం.. రొటీన్ స్టోరీ.. మూస డైలాగ్ డెలివ‌రీ, ఆస‌క్తిక‌ర కోణం మిస్‌. ఇలా మొత్తానికి ప‌వ‌న్ అభిమానులు నీరుగారి పోయారు. ఎంతో బాగుంటుంద‌ని వంద‌ల, వేల‌ రూపాయ‌లు పోసి మ‌రీ టిక్కెట్లు కొనుక్కుని బెనిఫిట్ షో కోసం అర్ధ‌రాత్రి చ‌లిలో వెళ్లిన వారికి సినిమీ చూశాక ముచ్చెమ‌ట‌లు పోశాయ‌ట‌! ఇంత దారుణంగా ఉంటుంద‌నుకోలేదు! అనే కామెంట్లు ఎక్కువ‌గా వినిపించాయి. దీంతో ఈ మూవీ ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ రేంజ్‌లో పెద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచిపోయింద‌ని కూడా విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. నిజానికి అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ సరైనా హిట్ లేదు. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు ఫ్లాపులు. ఇలాంటి సమయంలో ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. అభిమానులు ఎన్ని ఆశ‌లు పెట్టుకుంటారు?
కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఆవిధంగా ఆలోచించ‌లేక‌పోయాడా? అజ్ఞాతవాసి విష‌యంలో అతికి పోయాడా? తాను క‌నిపిస్తే చాలు అని అభిమానులు అనుకుంటుర‌ని అనుకున్నాడా? అనే సందేహాలూ వ‌స్తున్నాయి. ఇక‌, ఈ మూవీ విష‌యానికి వ‌స్తే.. క‌థ ఎంత పేల‌వంగా(వీక్‌) ఉందో తెలిసిందే. అయితే, ఈ సినిమాకు ముందు పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని తెలిసింది. ఈ సినిమా కధను ఫోన్ లో రెండు నిమిషాలు విని ఓకే చేశారట పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని దర్శకుడు త్రివిక్రమ్ గొప్పగా చెప్పుకున్నాడు.

సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలిసింది. ఇది ఎంత పెద్ద నిర్లక్ష్యమో అని. అసలు ఫోన్ లో ఒక నిమిషం కధ చెప్తే ఒప్పుకోవడం ఏమిటని పవన్ కళ్యాణ్ అభిమానులే ప్రశ్నిస్తున్నారు. పోనీ.. ఆ ఒక్క నిముష‌మో.. రెండు నిముషాలో.. ప‌వ‌న్ జాగ్ర‌త్త వ‌హించి ఉంటే పండ‌గ పూట ఇంత పెద్ద డిజాస్ట‌ర్ న‌మోదయ్యేది కాద‌ని అంటున్నారు అభిమానులు. సో.. ప‌వ‌న్ ఇక‌నుంచైనా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అబిమానులు కోరుతున్నారు.

జై సింహా 5 డేస్ కలెక్షన్స్… అదరకొడుతున్న బాలయ్య

Leave a comment