Gossipsజై సింహా 5 డేస్ కలెక్షన్స్... అదరకొడుతున్న బాలయ్య

జై సింహా 5 డేస్ కలెక్షన్స్… అదరకొడుతున్న బాలయ్య

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన లేటెస్ట్ మూవీ జై సింహా. బాల‌య్య సంక్రాంతి సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ శుక్ర‌వారం రిలీజ్ అయిన ఈ సినిమా ప‌ర్వాలేద‌న్న టాక్ తెచ్చుకుంది. జై సింహా బాల‌య్య అభిమానుల‌ను బాగా మెప్పించ‌డంతో పాటు బీ, సీ సెంట‌ర్ల‌లోనూ, మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉండ‌డంతో ఈ సినిమాకు తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి.
జై సింహాలో బాల‌య్య మార్క్ యాక్ష‌న్‌, డైలాగులు, ఫైట్స్ హైలెట్ అయ్యాయి. ఫ‌స్టాఫ్‌తో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో సెకండాఫ్ అంచ‌నాలు అందుకోలేక‌పోవ‌డం కాస్త మైన‌స్ అయ్యింది. అయినా సినిమా ప‌ర్వాలేద‌ని మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డంతో పాటు ఈ సినిమా తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ 8.25 కోట్ల కోట్లు కొల్ల‌గొట్టింది.
కానీ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అన్ని అంశాలు ఉండటంతో సినిమా టాక్ ఎబో యావరేజ్ నుండి హిట్ కి మధ్యలో ఉండటంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేసేందుకు అన్ని అర్హతలు సాధించింది…సంక్రాంతి వీకెండ్ లో కుమ్మేసే కలెక్షన్స్ ని సాధించి సంచలనం సృష్టించింది.
రెండు రోజుల్లో కేవలం 10 కోట్లు మాత్రమె వసూల్ చేసిన ఈ సినిమా తర్వాత రెండు రోజుల్లో సూపర్బ్ కలెక్షన్స్ ని సాధించింది. నైజాంలో 3.12 కోట్లు, సీడెడ్ లో 4.1 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా టోటల్ ఆంధ్రాలో 7.5 కోట్ల షేర్ మార్క్ ని సినిమా అందుకుంది.
దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో 16.72 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద 3.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది…దాంతో 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 20 కోట్ల షేర్ ని అందుకుంది…ఇవాళ కూడా సెలవు అవ్వడంతో సినిమా జోరు ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news