Gossipsకుర్రకారులను వెంట తిప్పుకుంటున బుల్లితెర భామ..!

కుర్రకారులను వెంట తిప్పుకుంటున బుల్లితెర భామ..!

స్టార్ క్రేజ్ ఉన్న వారికే సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో స్టార్ ఇమేజ్ రాకున్నా సరే వారి సోషల్ బ్లాగ్ అప్డేట్స్ తో వారు సెలబ్రిటీస్ గా మారుతారు. ఆ క్రమంలో సీరియల్స్ లో తల్లి పాత్రలు చేస్తూ అడపాదడపా సినిమాల్లో కూడా సిస్టర్, మదర్ రోల్స్ లో అలరిస్తున్న భామ మామిళ్ల శైలజా ప్రియ.

హీరోయిన్ కటౌట్ ఉన్న ఈమే సీరియల్స్ లో బిజీ స్టార్. అయితే ఈమధ్య సినిమాల్లో కూడా జోరు అందుకుంది. ఇక ఈ అమ్మడి ఫేస్ బుక్ ఫాలోవర్స్ ఎంతమంది తెలిస్తే షాక్ అవుతారు. 5 మిలియన్ ఫాలోవర్స్ పైగా అమ్మడికి ఉన్నారంటే ఆమె రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. తన అప్డేట్స్, పిక్స్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ అలర్ట్ గా ఉండే ప్రియా ఫేస్ బుక్ ఫాలోవర్స్ లో స్టార్స్ తో పోటీ పడుతుంది.

రొజు రోజుకి ఆమె ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. పెళ్లై పిల్లలున్నా ఆమెకు సోషల్ మీడియాలో క్రేజ్ ఈ రేంజ్ లో ఉండటం చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. హోమ్లీ లుక్ తో అందరిని అలరించే ఈమే క్రేజ్ పై ఏ దర్శకుడి కన్నైనా పడితే మాత్రం ఆమెను హీరోయిన్ గా కూడా ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news