Moviesఆరెక్స్ 100 కలక్షన్స్.. 4వ రోజే లాభాల్లోకి.. పాయల్ అందాలు బాగా...

ఆరెక్స్ 100 కలక్షన్స్.. 4వ రోజే లాభాల్లోకి.. పాయల్ అందాలు బాగా పనిచేశాయ్..!

జూలై 12 (గురువారం) రిలీజ్ అయిన ఆరెక్స్ 100 సంచలన విజయం అందుకుంది. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఆరెక్స్ 100లో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్స్ గా నటించారు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యువత మనసులు గెలిచింది.

సినిమా మొదటి రోజు డివైడ్ టాక్ రాగా యూత్ ఆడియెన్స్ నచ్చే అంశాలు పుష్కలంగా ఉండటంతో సినిమా రికార్డ్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. మొదటి రోజు కోటిన్నర కలక్షన్స్ సాధించిన ఆరెక్స్ 100 నాలుగురు రోజులు ముగిసే సరికి 5.19 కోట్లతో అదిరిపోయే వసూళ్లను రాబట్టింది.

ఏరియాల వారిగా ఈ సినిమా కలక్షన్స్ వివరాలు..

నైజాం : 2.42 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.61 కోట్లు
సీడెడ్ : 0.59 కోట్లు
ఈస్ట్ : 0.42 కోట్లు
వెస్ట్ : 0.32 కోట్లు
కృష్ణా : 0.35 కోట్లు
గుంటూర్ : 0.36 కోట్లు
నెల్లూరు : 0.12 కోట్లు

ఏపి/తెలంగాణా : 5.19 కోట్లు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news