Moviesటాలీవుడ్ స్టార్ ని కాదని ఆ ఓవర్ యాక్టింగ్ హీరోకి ఓటు...

టాలీవుడ్ స్టార్ ని కాదని ఆ ఓవర్ యాక్టింగ్ హీరోకి ఓటు వేసిన సమంత ..బ్రెయిన్ దొబ్బిందా ఏంటి..?

సమంత .. ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా .. కాదు అంతకుమించిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . అంతేనా ఏకంగా వన్ ఆఫ్ ద బడా ఫ్యామిలీ అయిన టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ కుటుంబానికి కోడలుగా మారింది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట విడాకులు తీసుకున్నారు .

వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగానే ఈ జంట విడిపోయారు అని తెలుస్తుంది . విడిపోయిన తర్వాత తన లైఫ్ తనది అంటూ బ్రతికేస్తుంది సమంత. తనకు నచ్చిన చోటికి వెళుతుంది ఇష్టం వచ్చిన ఫుడ్ తింటుంది . ఇష్టం వచ్చిన వాళ్ళతో స్నేహం చేస్తుంది . మరీ ముఖ్యంగా విడాకులు తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోలతో బాగా చనువుగా మూవ్ అవుతుంది సమంత అన్న కామెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాము.

తాజాగా సమంత బాలీవుడ్ హాట్ హీరో రన్వీర్ సింగ్ తో ఓ యాడ్ లో నటించింది . ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో యాడ్ లో రన్వీర్ సింగ్ సమంత నటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నిజానికి ఈ యాడ్లో మొదటగా రామ్ చరణ్ ని అనుకున్నారట మేకర్స్ . కానీ సమంత రామ్ చరణ్ కి కాకుండా రన్వీర్ సింగ్ కె ఓటు వేసింది అంటూ తెలుస్తుంది . జొమాటో నిర్వాహకులు రామ్ చరణ్ లేదా రన్వీర్ సింగ్ ను ఎవరైనా ఒకరిని చూస్ చేసుకోండి అంటూ సమంత కి ఛాయిస్ ఇచ్చారట .

అయితే సమంత రన్వీర్ సింగ్ ని చూస్ చేసుకోవడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో మరి రామ్ చరణ్ ని ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది ప్రశ్నార్థకంగా మారింది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news