Moviesఅమ్మ బాబోయ్.. రష్మిక మహా ముదురే.. ఆ ప్రాబ్లం రాకుండా ముందు...

అమ్మ బాబోయ్.. రష్మిక మహా ముదురే.. ఆ ప్రాబ్లం రాకుండా ముందు నుంచే ఎలా జాగ్రత్తలు తీసుకుంటుందో చూడండి..!

రష్మిక మందన్నా.. చాలా టాలెంటెడ్ హీరోయిన్.. ఎంతలా అంటే తన కొంప కాలిపోతుంది ఏమో అని ముందు నుంచి ఇంటిపై నీళ్లు చల్లుకునే టైపు. పేరుకు కన్నడ బ్యూటీ నే అయినా తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుంది . మరీ ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో చక్రం తిప్పుతుంది .

అంతేనా రీసెంట్గా రిలీజ్ అయిన యానిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీ అంటూ ట్యాగ్ చేయించుకుంది . రీసెంట్గా రష్మిక మందన్నా.. ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పిక్చర్ షేర్ చేసింది. అందులో ఆమె స్పానిష్ లవ్ ఆఫ్ డిస్క్రిప్షన్ అనే బుక్స్ చదువుతున్నట్లు తెలుస్తుంది. ఇది చూసిన ఎవరికైనా సరే ఒక విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. ప్రేమలో మోసపోకుండా ఉండడం ఎలా అనే విషయంపై ముందుగానే అవగాహన తెచ్చుకునేందుకు రష్మిక ఈ బుక్స్ చదువుతున్నట్లు క్లియర్గా తెలుస్తుంది .

అయితే రష్మిక ఇది ఎవరికి చెప్పకుండా చదివి ఉంటే అసలు ప్రాబ్లమే వచ్చేది కాదు . అసలే సోషల్ మీడియా ..ముందుగానే ఆమెకి విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయ్. ఇలాంటి మూమెంట్లోనే.. ఇలాంటి ఒక పోస్ట్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.అసలే రష్మిక – విజయ్ మధ్య ఏదో నడుస్తుంది ..పాకుతుంది అనుకునే జనాలకు నడవడం – పాకడం కాదు పరిగెడుతుంది అనే రేంజ్ లో హింట్ ఇచ్చేసింది రష్మిక. కొంతమంది రష్మిక మహా ముదురే ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటుంది ..అంటుంటే అది కన్నడ పిల్లరా బాబోయ్ ..తెలివితేటలు ఎక్కువే అంటూ నాటీ కామెంట్స్ చేస్స్తున్నారు కుర్రాళ్ళు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news