Moviesచిరంజీవి చేసిన సినిమాలలో..ఎన్టీఆర్ రీమేక్ చేయాలి అనుకుంటున్న మూవీ ఏంటో తెలుసా..?

చిరంజీవి చేసిన సినిమాలలో..ఎన్టీఆర్ రీమేక్ చేయాలి అనుకుంటున్న మూవీ ఏంటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది ఓ బాగా ట్రెండ్గా మారిపోయింది . గతంలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ దక్కించుకున్న సినిమాలను మళ్లీ మరొకసారి రిలీజ్ చేస్తూ ఉండడం ..అదే విధంగా హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ పేరిట ఆ సినిమాలకు కంటిన్యూవేషన్ కథలను తెరకెక్కిస్తూ ఉండడం ..మనం బాగా గమనిస్తున్నాం . అయితే ఓ హీరో చేసిన కథను ఆ హీరో రీమేక్ గా చేస్తాడు . కానీ ఇక్కడ మాత్రం ఓ హీరో చేసిన కథను ఇంకొక హీరో సీక్వెల్ తెరకెక్కించడానికి ఇష్టపడుతున్నారు . ఆ హీరో మరెవరో కాదు తారక్…

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలను మైంటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. రెండు కూడా భారీ బడ్జెట్ సినిమాలు కావడం విశేషం. అయితే ఒకానొక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన మనసులోని కోరికను బయటపెట్టాడు.

“తన ఫేవరెట్ హీరో తాతగారు అని ..ఆ తర్వాత చిరంజీవి గారు అంటే చాలా చాలా ఇష్టమని ..ఆయన డాన్స్ ఆయన వే ఆఫ్ డెలివరీ డైలాగ్ నాకు బాగా నచ్చుతుంది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు చిరంజీవి నటించిన సినిమాలలో రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమాను రీమేక్ చేస్తారు అని హోస్ట్ ప్రశ్నించగా ..జగదేకవీరుడు అతిలోకసుందరి అంటూ చెప్పుకొచ్చారు “. నిజానికి ఈ సినిమా కు సీక్వేల్ రావాలి అని ఎప్పటినుంచో ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. అయితే చిరంజీవిని అందులో నటిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు .

ఎన్టీఆర్ మాట్లాడిన మాటలతో .. ఎన్టీఆర్ కూడా ఈ పాత్రకు బాగా సూట్ అవుతాడు అని .. అయితే హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నే తీసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . చూద్దాం మరి ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే గట్స్ ఉన్న డైరెక్టర్ ఎవరా..? ఎప్పుడు ఆ సినిమాను సెట్స్ పై కి తీసుకొస్తాడా..? అనే విషయం తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news