Moviesఅందరికీ నో చెప్పే సాయి పల్లవిని .. రిజెక్ట్ చేసిన టాలీవుడ్...

అందరికీ నో చెప్పే సాయి పల్లవిని .. రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..? శభాష్ రా అబ్బాయ్..!

సాయి పల్లవి .. ఇండస్ట్రీలో స్ట్రిక్ట్ హీరోయిన్ . కాదు కాదు ఓ పంతులమ్మ అంటుంటారు జనాలు . సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే చాలా జోవియల్ గా.. సరదాగా అల్లరి చిల్లరగా.. ముద్దు ముద్దుగా ముద్దులు పెడుతూ ..హగ్గులు చేసుకుంటూ ఉంటారు . కానీ ఈ హీరోయిన్ ఏంటో స్కూల్లో టీచర్ల స్ట్రిక్ట్ గా ఉంటుంది అంటూ చాలామంది జనాలు కామెంట్స్ చేశారు.

మనకు తెలిసిందే హీరోయిన్ సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో నటించదు.. రొమాంటిక్ డైలాగ్స్ చెప్పదు.. వల్గర్ సీన్స్ ఉంటే ఆ సినిమానే రిజెక్ట్ చేసి పడేస్తుంది . చాలామంది స్టార్ హీరోల సినిమాలను అమ్మడు కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తామనిచెప్పిన రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే . రీసెంట్గా సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది .

అందరి హీరోలను రిజెక్ట్ చేసే సాయి పల్లవి ని తెలుగు హీరో రిజెక్ట్ చేశాడు అన్న వార్త. ఆయన మరి ఎవరో కాదు. విజయ్ దేవరకొండ.. ఎస్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సాయి పల్లవి తో సినిమాను రిజెక్ట్ చేసాడట . “ఫ్యామిలీ స్టార్” సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని అనుకున్నారట . ట్రెడిషనల్ పాత్ర అయినప్పటికీ సాయి పల్లవి ఆ పాత్రకి వద్దు అంటూ విజయ్ నో చెప్పారట .

ఎంత ఫ్యామిలీ పాత్ర అయినా సరే అరా కొరా రొమాన్స్ లేకపోతే ఆ పాత్ర పండదు . అలాంటి సీన్స్ కూడా ఆమె చేయను అంటుంది. అడిగి నో అనిపించుకోవడం కంటే మనమే రిజెక్ట్ చేయడం బెటర్ అంటూ విజయ్ దేవరకొండ సాయి పల్లవి ని ఆ పాత్రకు వద్దనే వద్దు అంటూ మేకర్స్ కి సజెస్ట్ చేశారట . అన్న విధంగానే మేకర్స్ కూడా ఆమెను ఆ పాత్ర నుంచి తప్పించారు మృణాల్ ఠాకూర్ ను ఆ పాత్ర కోసం చూస్ చేసుకున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news