Moviesఒక్కే ఈవెంట్ లో మెరిసిన సమంత-నాగచైతన్య..ఎంత హ్యాపీగా నవ్వుకున్నారో చూడండి.. పిక్స్...

ఒక్కే ఈవెంట్ లో మెరిసిన సమంత-నాగచైతన్య..ఎంత హ్యాపీగా నవ్వుకున్నారో చూడండి.. పిక్స్ వైరల్..!!

సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకున్నారు . అప్పటి నుంచి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు ఏదో ఒకటి ట్రెండ్ అవుతూనే ఉంటుంది . అయితే విడాకుల తర్వాత వీళ్ళు కలిసి ఒకే ఈవెంట్లో కలిసిన దృశ్యాలు అస్సలు మనం చూడలేదు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం సమంత నాగచైతన్య ఒకే ఈవెంట్లో మెరిసారు .

దానికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అమెజాన్ ప్రైమ్ ముంబై వేదికగా ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ ఒరిజినల్ ప్రాజెక్ట్స్ లో భాగమైన నటీనటులను సాంకేతిక నిపూణలను ఈ మెగా ఈవెంట్ కు హాజరయ్యేలా చేసింది . కరణ్ జోహార్ ఈ కార్యక్రమానికి హోస్టగా వ్యవహరించారు. ఇక బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత సిటాడల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈవెంట్ కు అటెండ్ అయింది . రాజ్ అండ్ డీకే హీరో వరుణ్ ధావన్ – సమంతలను.. కరణ్ జోహార్ వేదిక పైకి ఆహ్వానించి.. సిటాడిల్ ఇండియన్ వర్షన్ సిరీస్ గురించి మాట్లాడేలా చేశారు .

అంతేకాదు హనీ – బన్నీ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. అలాగే నాగచైతన్య క్రైమ్ ధ్రిల్లర్ “దూత” కోసం అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు హాజరయ్యాడు . ఈ ఈవెంట్ లో చైతన్య మాట్లాడడం అందరికీ హైలెట్గా మారింది . ఆ విధంగా సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ప్రమోషన్ ఈవెంట్లో భాగమయ్యారు . దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత కొంతకాలంగా సమంత నాగచైతన్య కలవబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ ఈవెంట్ లో ఇద్దరు కలిసిన తర్వాత అది నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు జనాలు ..కానీ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం అది చచ్చిన జరగదు అంటూ కొట్టి పడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news