Moviesఫ్యామిలీ స్టార్ లోని ఈ పాట వింటుంటే .. అచ్చం మహేష్...

ఫ్యామిలీ స్టార్ లోని ఈ పాట వింటుంటే .. అచ్చం మహేష్ బాబు హిట్ సాంగ్ లా లేదు.. ఫ్యాన్స్ కీ పాయింట్ పట్టేశారుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ … తాజాగా నటిస్తున్న సినిమా “ఫ్యామిలీ స్టార్”. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు . ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్.. హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది . ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంటూ వచ్చింది.

రీసెంట్గా ఈ సినిమాలోని ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు . “కళ్యాణి వచ్చా వచ్చా” అనే ఈ సాంగ్ చాలా బాగా అభిమానులను ఆకట్టుకుంటుంది . ఇది ఓ పెళ్లి ధీమ్ సాంగ్ లా కనిపిస్తుంది . విజయ్ దేవరకొండ -మృణాల్ ఠాకూర్ జంట హైలెట్గా నిలిచింది. డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఇరగదీసారు . అయితే ఈ పాట వింటున్నంత సేపు జనాలకు మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒక్కడు సినిమాలోని పాట గుర్తిస్తుంది.

” అత్తారింటికి నిన్నెత్తుకు పోతాను గా..” అనే సాంగ్ లాగే ఈ పాట ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాస్ట్యూమ్స్ కూడా ఇంచుమించు అదే విధంగా ఉన్నాయి. దీంతో జనాలు ఈ పాటను రేంజ్ లో ట్రోల్ చేసేస్తున్నారు . చూద్దాం ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?.. ఈ సినిమా అయిపోగానే విజయ్ దేవరకొండ విజయ్ తిన్నూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు . ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఒక మాస్ సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు విజయ్ దేవరకొండ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news