Moviesమెగా ఫ్యాన్స్ బూతులు తిడతారు అని తెలిసిన .. బుచ్చిబాబు అలాంటి...

మెగా ఫ్యాన్స్ బూతులు తిడతారు అని తెలిసిన .. బుచ్చిబాబు అలాంటి పని ఎందుకు చేస్తున్నారో తెలుసా ..? సుకుమార్ కంటే కన్నింగా ఉన్నాడే..!

బుచ్చిబాబు సనా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ శిష్యుడుగా అందరికీ తెలిసిన వాడే . అంతేకాదు ఉప్పెన సినిమాను డైరెక్ట్ చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు . ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫస్ట్ సినిమాలోనే చాలా వేరియేషన్స్ చూపించి శభాష్ అనిపించుకున్నాడు . ఫస్ట్ సినిమా తర్వాత సెకండ్ సినిమా ఎవరితో తీయబోతున్నాడు అంటూ చాలా కాలం వెయిట్ చేశారు అభిమానులు. ఇన్నాళ్ళకి ఆ టైం దగ్గర పడింది .

రాంచరణ్ తో బుచ్చిబాబు సనా.. ఓ క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కించబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతుంది . అంతేకాదు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంది అని ..ఆ పాత్ర కోసం కృత్రిసనన్ ను చూస్ చేసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమా షూటింగ్ ఈ నెల 20న స్టార్ట్ చేయబోతున్నారట.

అదే రోజు టైటిల్ కూడా ప్రకటించబోతున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఎన్టీఆర్ టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . గతంలో ఎన్టీఆర్ కోసం ఫిక్స్ చేసిన టైటిల్ ని బుచ్చిబాబు ఇప్పుడు చరణ్ కి వినిపించి ఓకే చేశాడట. బుచ్చిబాబు “పెద్ది” అనే టైటిల్ ని ఎన్టీఆర్ తో తెరకెక్కించాలి అని బాగా ఆశపడ్డారట . అయితే ఎన్టీఆర్ ఈ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర చరణ్ వద్దకు వెళ్ళింది . అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది.

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథను చరణ్ తో తెరకెక్కించాలి అనుకోవడమే పెద్ద సాహసం . మళ్ళీ అదే టైటిల్ పెడితే కచ్చితంగా ఫ్యాన్స్ బూతులు తిడతారు. కానీ ఎందుకు బుచ్చిబాబు సనా ఇలా చేశాడు అంటున్నారు జనాలు. అయితే సినిమాకి పెద్ది టైటిల్ చాలా ఆప్ట్ గా సూట్ అవుతుంది అని.. అందుకే కొంచెం బిగ్ రిస్క్ చేశాడు బుచ్చిబాబు సనా అని అంటున్నారు జనాలు . టైటిల్ కాస్త ఓల్డ్ స్టైల్ లో ఉన్న కంటెంట్ మాత్రం చాలా ఫ్రెష్ గా ఉండబోతుంది అంటున్నారు .. చూద్దాం ఏం జరుగుతుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news