Moviesఅన్ని విషయాలలో చాలా కూల్ గా ఉండే డార్లింగ్ ప్రభాస్ .....

అన్ని విషయాలలో చాలా కూల్ గా ఉండే డార్లింగ్ ప్రభాస్ .. ఆ ఒక్క డైరెక్టర్ పై మాత్రం ఎందుకు అంత కోప్పడతాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో అత్యంత కూలెస్ట్ హీరో ఎవరు..?? అనగానే అందరికీ గుర్తొచ్చే రెండే రెండు పేర్లు మహేష్ బాబు – ప్రభాస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు కూల్ అండ్ హ్యాండ్సమ్ హీరో అంటూ బిరుదు కూడా ఉంది . అలాగే పాన్ ఇండియా పాపులారిటీ సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఏ విషయంలోనైనా సరే చాలా కూల్ గా ఉంటాడు .

చాలా సాఫ్ట్ గా ఆన్సర్ ఇస్తాడు . చాలా చాలా టాలెంటెడ్ పర్సన్ .. నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటారు అన్న పేరు ఎప్పటినుంచో ఉంది . పలు ఇంటర్వ్యూలలో కూడా ప్రభాస్ ఎక్కడ టంగ్ స్లిప్పయి కోపంతో ఊగిపోయిన సందర్భాలు కూడా లేవు . అయితే ఒక డైరెక్టర్ మేటర్ లో మాత్రం ప్రభాస్ ఎప్పుడు కూడా ఫుల్ ఫైర్ అవుతూ ఉంటారట . ఆయన ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి స్టార్ డైరెక్టర్.

ప్రభాస్ కెరియర్ కష్టంలో ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ టాప్ పొజిషన్లో ఉన్నాడు . అంతేకాదు ప్రభాస్ తో సినిమాను తీయాలి అంటూ చాలా ట్రై చేశాడు . అయితే ప్రభాస్ అంతకుముందు కమిట్ అయిన సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి ..ఈయనతో కమిట్ అయిన కాల్ షీట్స్ ని కూడా క్యాన్సిల్ చేసి చెప్పకుండా వేరొక స్టార్ హీరోతో కాల్ షీట్స్ బుక్ చేసుకున్నారట. ఆ టైంలో ప్రభాస్ చాలా చాలా హర్ట్ అయ్యారట . నమ్మించి మోసం చేశాడు అంటూ బాధ పడ్డారట. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ డైరెక్టర్ తో మాట్లాడింది లేదు.. ఆ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేసింది లేదు. అంత కోపం ప్రభాస్ కి ఆ డైరెక్టర్ అంటే .. ప్రజెంట్ ఆ డైరెక్టర్ ఫేడౌట్ అయిపోయాడు . ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news