Moviesపుష్ప2 VS కల్కి.. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే.....

పుష్ప2 VS కల్కి.. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే.. ఏ సినిమాకి బొక్క – ఏ సినిమా హిట్..?

ఇప్పుడు సినీ లవర్స్ కి పెద్ద ప్రాబ్లం ఎదురయింది . జనరల్ గా ఒక స్టార్ హీరో .. సినిమా రిలీజ్ అవుతూ ఉంటే మరొక స్టార్ హీరో సినిమా ఆ డేట్ లో కానీ ..ఆ డేట్ కి దరిదాపుల్లో కానీ ఉండకుండా చూసుకుంటూ ఉంటారు . పాన్ ఇండియా సినిమాలు అయితే దాదాపు కచ్చితంగా నెలరోజుల గ్యాప్ తో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటిది ఇద్దరు పాన్ ఇండియా హీరోల సినిమాలు ఒకే తేదీన రిలీజ్ అవ్వడానికి సిద్ధపడితే.. ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది .

అల్లకల్లోలంగా మారిపోదు.. రచ్చ రంబోలా చేసేయరు.. ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి సిచువేషన్ నెలకొనబోతున్నట్లు తెలుస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ .. కల్కి సినిమాలో నటించాడు . ఈ సినిమాను మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్ . అయితే మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో సెక్యూరిటీ పర్పస్ కారణంగా కొన్ని అనివార్య కారణాల చేత సినిమాను పోస్ట్ పోన్ చేయాలి అంటూ నిర్ణయించుకున్నారట మేకర్స్.

అందుతున్న సమాచారం ప్రకారం .. ఆగస్టు నెలలో 15వ తేదీ ఈ సినిమాను రిలీజ్ చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . అయితే అదే మూమెంట్ కి ఆల్రెడీ పుష్పరాజ్ ఆ డేట్ ని లాక్ చేసుకున్నాడు . ఎప్పుడో ఆ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాడు సుకుమార్ . ఇప్పుడు సడన్గా ప్రభాస్ అదే తేదీన వస్తూ ఉండడంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా మారిన ప్రభాస్ – అల్లుఅర్జున్ ల మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది .

స్టార్ హీరోలు వీళ్ళు ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్న ఫ్యాన్స్ మాత్రం అస్సలు లైట్ గా తీసుకోవట్లేదు. మా హీరో సినిమా హిట్ అవుతుంది అంటే,, మా హీరో తోపు అని మా హీరో సినిమాలో కంటెంట్ ఉంది అని.. ఇప్పటినుంచే సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ చేశారు . అంతేకాదు చాలామంది కల్కి సినిమా హిట్ అవుతుంది అంటుంటే.. మరికొందరు పుష్ప2 అంటున్నారు . మరి మీ దృష్టిలో మీకు ఏ సినిమా హిట్ అవుతుంది అనిపిస్తుంది..? ఒకవేళ కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఆగస్టు 15వ తేదీనే కల్కి సినిమా అదే విధంగా పుష్ప2సినిమా రిలీజ్ అయితే ..ఏ సినిమా హిట్ అవుతుంది..? ఏ సినిమా ఫట్ అవుతుంది ..? అని మీరు అనుకుంటున్నారు . కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ ను తెలియజేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news